NTV Telugu Site icon

TGSRTC: విజయవాడ రూట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్లపై భారీగా డిస్కౌంట్స్

Tgsrtc

Tgsrtc

TGSRTC: హైదరాబాద్ – విజ‌య‌వాడ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తోంది ఆర్టిసి. విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు టీజిఎస్‌ఆర్టీసీ నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీని అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. TGSRTC ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

Read Also: Shivaji Maharaj Jayanti: తెలుగు నేలపై నడయాడిన ఛత్రపతి శివాజీ..

ఇదివరకే తెలంగాణ నుంచి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు రూట్‌లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోను ప్రయాణాలకు 10 శాతం డిస్కౌంట్ వర్తించనుంది. ఈ రాయితీ వల్ల ప్రయాణీకుల భారం తగ్గి, ఒక్కో వ్యక్తికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇక త్వరలో రాబోతున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ విషయంపై ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన శైవ క్షేత్రాలైన వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి ప్రాంతాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. బస్సు కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు.

KCR: పాస్పోర్ట్ ఆఫీస్లో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ నుండి శ్రీశైలానికి భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసి ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. శివరాత్రి నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులకు అధిక సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేలా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.