Vehicle Tax Cancelled: వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 2 శాతం ట్యాక్స్ రద్దు..
- రెండో వాహనం కొనుగోలుపై అదనపు భారం నుంచి విముక్తి..
- 2 శాతం ట్యాక్స్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- మార్చి 23 నుంచి అమలుకు శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతంగా వాహనం ఉన్నవారు మరో కొత్త బండి కొనుగోలు చేయాలంటే ఇప్పటివరకు అదనపు భారం పడేది. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. రెండో వాహనం కొనుగోలుపై ప్రభుత్వం విధిస్తున్న అదనపు 2 శాతం జీవితకాలపు పన్ను (Life Tax)ను రద్దు చేస్తూ తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
ఎందుకు ఈ మార్పు..?
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
రాష్ట్ర రవాణా శాఖలో ఈ నెల 23 నుంచి జాతీయ స్థాయి ‘వాహన్’ (VAHAN) పోర్టల్ అందుబాటులోకి వస్తోంది. దీనితో మన రాష్ట్ర రవాణా వ్యవస్థ అనుసంధానం కాబోతోంది. ఈ పోర్టల్ పనితీరు ప్రకారం.. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా.. అదనపు పన్ను సాఫ్ట్‌వేర్‌లో జనరేట్ కాదు. దీనివల్ల సాంకేతికంగా రెండో వాహనంపై వేసే ఎక్స్ట్రా ట్యాక్స్ ఆగిపోనుంది.
Also Read:Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..
సాధారణంగా ఒక వాహనం ఉన్న వ్యక్తి రెండోది కొంటే.. దాని విలువపై అదనంగా 2 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు. కేవలం రెండో వాహనమే కాదు, ఆ తర్వాత మీరు ఎన్ని వాహనాలు కొన్నా సరే.. అదనపు పన్ను పడదు.
అదనపు పన్ను రద్దయినప్పటికీ.. ప్రతి వాహనానికి విధిగా చెల్లించే సాధారణ జీవితకాలపు పన్ను (Life Tax) మాత్రం యధావిధిగా కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వేల సంఖ్యలో వాహనదారులు రెండో వాహనం కొంటూ ఈ అదనపు భారాన్ని మోస్తున్నారు. తాజా నిర్ణయంతో వారందరికీ ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ఈ నెలాఖరు నుంచి కొత్త బండి కొనే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!