Police Rules For 31St Night : న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు నగరం సిద్ధమవుతోంది. శనివారం వీకెండ్…. కొత్త సంవత్సరం ఒకే సారి రావడంతో ప్రజలంతా ఫుల్ ప్లానింగ్లో ఉన్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దావత్ చేసుకునేందుకు యువకులు ప్లేసెస్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. కేకులు, ముక్క, చుక్క రెడీ చేస్తున్నారు. నగర వాసులు వాళ్లపనిలో వారుంటే… పోలీసులు సైతం వారి భద్రత కోసం ఏర్పాటు చేస్తున్నారు. యువత న్యూ ఇయర్ వేడుకల హడావుడిలో ఉంటే… రూల్స్ మాత్రం మస్ట్ అని పోలీసులు అంటున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే సమయంలో… బ్లాక్ స్పాట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.
Read Also: Massive Accident: దట్టంగా అలుముకున్న పొగమంచు.. హైవేపై ఢీకొన్న 200కార్లు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి ఒకటో తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేయనున్నారు. వారర్ పై లైట్ మోటార్ వెహికల్ కు అనుమతి లేదని ప్రకటించారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు. కమిషనరేట్ పరిధిలోని 10 ఫ్లైఓవర్లు మూసివేత కొనసాగుతుంది. రాత్రి 11 గంటల నుండి మరుసటి రోజు 5 గంటల వరకు పీవీ ఎక్స్ప్రెస్ వే క్లోజ్ కానుంది. బార్లు, పబ్బులు, క్లబ్ లో యజమానులు తమ కస్టమర్లు డ్రంకన్ డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి. లేని పక్షంలో యజమానుల పైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి యథావిధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మైనర్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాల నడిపితే కోర్టులో హాజరు పరుచనున్న పోలీసులు. వాహనాలలో భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్లు పెట్టుకుంటే వారిపై కేసులు నమోదు చేస్తారు పోలీసులు. క్యాబ్ డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించాలి, అవసరమైన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
