Site icon NTV Telugu

Local Body Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఫలితాలు

Local Body Elections

Local Body Elections

Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.. పోలింగ్ కేంద్రం ఆవరణలో మధ్యాహ్నం 1 గంటలోపు ఉన్న వారికి టోకెన్లు జారీ చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బ్యాక్స్ లను సీల్ చేశారు.. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు చేపడతారు.. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి, కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగిస్తారు.. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్లు ఉంచుతారు.. బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ ను ట్రేలో అమర్చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు.. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం.. వార్డు సభ్యులతో కలిసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.

READ MORE: Lok sabha: లోక్‌సభలో ఈ-సిగరెట్‌పై దుమారం.. చర్యలుంటాయని స్పీకర్ హెచ్చరిక

కాగా.. కొన్ని చోట్ల మినహా దాదాపు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల ఘర్షణ తలెత్తింది.. పోలింగ్ బూత్ లోకి వెళ్లి అధికార పార్టీ ఓటు వేయాలని ఓ వ్యక్తి సైగ చేశాడు. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.. ఓడిపోతామని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు చేశారు.. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం పోలింగ్ సాఫీగా సాగింది.

Exit mobile version