Site icon NTV Telugu

Kishan Reddy : జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయండి

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నదేమిటంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరో 2,500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుందని అన్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం రూ. 12,619 కోట్ల వ్యయంతో 691.52 కిమీ పొడవున నిర్మించనున్న లేదా నిర్మించబడుతున్న 16 జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం 1,550.529 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 904.097 హెక్టార్ల భూమినే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్వాధీనం చేయిందని, ఇంకా 646.432 హెక్టార్లు మిగిలి ఉన్నాయని వివరించారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడి, పారిశ్రామిక అభివృద్ధి , ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ చూపి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనీ, నిర్మాణాలను గడువులోపే పూర్తి చేసేలా సహకరించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు.

Jagadish Reddy: HCU తరలింపు అనాలోచిత నిర్ణయం.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్

Exit mobile version