NTV Telugu Site icon

Etela Rajender: తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది.. కానీ ఆత్మగౌరవం కోల్పోదు..

Etela

Etela

యాదాద్రి జిల్లాలో ఉద్యమకారుడు జీట్ట బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ్ బాలాయ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అలయ్ బాలాయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ హాజరయ్యారు. బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవం కోల్పోదు అంటూ వ్యాఖ్యనించాడు.

Also Read: OG: బ్రేకుల్లేని బుల్‌డోజర్ లా ఉన్నారు…

తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు సూకల్డ్ అభివృద్ధి కాదు అని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు.. తెలంగాణలో రైతు వేదికలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.. రాష్ట్రాల్లో పంటలు పండినా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమ్ముకోలేని దుస్థితి నెలకొంది అని ఈటెల రాజేందర్ అన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎం మేలు చేసిందో చెప్పాలి అని ఈటెల డిమాండ్ చేశారు.

Also Read: Kodandaram: తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం టీజేఎస్ తోనే సాధ్యం

పంచాయతీ కార్యదర్శిలకు, వీఓఏ, ఆర్టీసీ కార్మికులకు, రాష్ట్రప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుంది.. రింగ్ రోడ్డుల నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తింది అని విమర్శించారు. ధర్మాన్ని న్యాయాన్ని ప్రజలను నమ్ముకున్న మాకు మంచి జరుగుతుంది.. ప్రజల అండదండలు మాకు ఉంటాయి అని ఈటెల రాజేందర్ అన్నారు.

Also Read: West Bengal: రైలు ప్రమాదంలో గాయపడిన వాళ్లను తరలిస్తున్న బస్సుకు ప్రమాదం..

అలయ్ బలాయ్ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. అప్పు, సిప్పు, డప్పుగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మారింది అని కామెంట్స్ చేశారు. తెలంగాణలో ప్రతి ఓటరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది.. ఓటుకు పదివేలు, లక్ష ఇచ్చినా తీసుకోండి మనకు ఆ నేతలు బాకీ ఉన్నారు.. ఉద్యమం సమయంలో తెలంగాణ వస్తే రాష్ట్ర రూపు రేఖలు మారి, అభివృద్ధి సాధిస్తామని ఆశించాం.. కానీ ఇప్పుడు మరోక విధంగా రాష్ట్రం మారిందని ఆయన వ్యాఖ్యనించారు.

Show comments