Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో నేడు (బుధవారం) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట టోకెన్లు జారీ చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేస్తారు. పోలీసుల భారీ భద్రత నడుమ వీటిని నిర్దేశించిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 62% పైగా పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతం కార్పొరేషన్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
T20 World Cup: ‘‘మా క్రికెటర్ల నిర్ణయం ఇది’’.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్ యూ-టర్న్..
