NTV Telugu Site icon

Medigadda Barrage: 29న మేడిగడ్డ బ్యారేజీకి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌ బాబు!

Medigadda Barrage

Medigadda Barrage

Ministers To Visits Medigadda Barrage on December 29: డిసెంబర్ 29న తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు బయల్దేరి.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను గురించి మంత్రులు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్‌, మేడిగడ్డ-సుందిళ్ల-అన్నారం బ్యారేజీల సమస్యలు.. వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.

Also Read: Yadadri Temple: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటల సమయం!

కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఈఎన్‌సీని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధమున్న అందరికి సమాచారం అందించాలని.. అందరూ ఈ సమావేశంలో పాల్గొనేలా చూడాలన్నారు. ఈ సమీక్షను కవర్ చేయడానికి మీడియాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.