New Ministers Chambers : తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సచివాలయంలో తమ తనఖా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చాంబర్ల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్‌కు సచివాలయ మొదటి అంతస్తులో 13, 14, 15, 16 నంబర్ గదులు కేటాయించగా, మంత్రి వివేక్ వెంకటస్వామికి రెండో అంతస్తులో 20, 21, 22 నంబర్ గదులు లభించాయి. వాకిటి శ్రీహరికి రెండో అంతస్తులోనే 26, 27, 28 నంబర్ గదులు కేటాయించారు.
Shreyas Iyer : ఇంత బలుపు ఏంటి అయ్యర్.. రోహిత్ కు అవమానం
ఇప్పుడు చాంబర్లు కేటాయింపుతో వీరు త్వరలోనే తమ శాఖల అధికారిక బాధ్యతలను స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారికి శాఖల కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత వంటి సామాజిక రంగాలకు సంబంధించిన కీలక శాఖలు అప్పగించగా, వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ వంటి పారిశ్రామిక రంగాల శాఖలు లభించాయి. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో వీరికి కేటాయించిన కొత్త కార్యాలయాలు త్వరలో బిజీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త మంత్రులతో కార్యాలయాల్లో కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది.
Anirudh : కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్