Site icon NTV Telugu

TS Ministers : అలెర్ట్ గా ఉన్నాం.. అన్ని చర్యలు తీసుకుంటున్నాం : మంత్రులు

Ministers

Ministers

TS Ministers : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని.. ప్రజలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని.. ఎన్డీఆర్ ఎఫ్‌ బృందాలను ఆ జిల్లాలకు పంపించామన్నారు మంత్రి శ్రీనివావస్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆయా జిల్లా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు.

Read Also : Pocharam Project : ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. తెగే ప్రమాదం..

జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి తగిన భోజన వసతి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కురవని వర్షాలు ఈ సారి మెదక్, కామారెడ్డిలో కురిశాయని.. అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పోచారం ప్రాజెక్ట్ తెగే ప్రమాదం ఉందని.. ఆ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశామన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వ సహాయ, సహకారాలు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్.

Read Also : KTR : తెలంగాణ నీటమునిగితే సీఎం బీహార్ లో ఉంటారా.. కేటీఆర్ ట్వీట్

Exit mobile version