Election Code Cash Limit: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సులోను పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర జిల్లా రహదారులపై వాహనాలను సోదాలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్ళేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండాలంటే.. సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీస్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జీఎస్టి అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు.
Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
అత్యవసరమైన వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తల్లో నగదు తీసుకువెళ్ళేవారు సరైన ఆధారాలు దగ్గరుంచుకొని అధికారులకు చూపాలి. తనికీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Deepika Padukone : ఆ డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె..
