Site icon NTV Telugu

Telangana Inter Results 2025: ఇంటర్ ఫలితాలు విడుదల.. మళ్లీ బాలికలదే హవా…

Inter Results3

Inter Results3

నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ‌ మధ్యాహ్నం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మార్చి 5వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు 25న ముగిసిన విష‌యం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి
tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. ఫస్ట్ ఇయర్‌ లేదా సెకండ్‌ ఇయర్ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. మీ హాల్‌ టికెట్‌ ఎంటర్‌ చేయండి. ఫలితాలు వస్తాయి.. ప్రింట్ తీసుకోండి. కాగా.. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలు రాణించారు.

READ MORE: Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభకు స్మృతి ఇరానీ, అన్నామలై

కాగా.. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 4,88,430 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్ బాలికలు 73.83, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,39,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,93,852 మంది పాస‌య్యారు. కాగా.. 66.89శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక‌ వొకేషనల్‌లో 49,128 మంది పరీక్షలు రాయగా.. 28,339 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 57.68శాతం ఉత్తీర్ణత నమోకాగా.. బాలికలు 74.09శాతం, బాలుర 40.88శాతం ఉత్తీర్ణత నమోదైంది.

READ MORE: Ram Pothineni : రామ్ పోతినేని తో డేటింగ్.. రింగ్ తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

రెండో సంవత్సరంలో జనరల్+వోకేషనల్ కలిపి 5,08,582 మంది విద్యార్థులు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం బాలికలు 74.21, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌లో 4,39,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,93,852 మంది పాస‌య్యారు. కాగా.. 66.89శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక‌ వొకేషనల్‌లో 49,128 మంది పరీక్షలు రాయగా.. 28,339 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 57.68శాతం ఉత్తీర్ణత నమోకాగా.. బాలికలు 74.09శాతం, బాలుర 40.88శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే.. మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Exit mobile version