తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్ ను ప్రభుత్వ సలహా దారు కెకె, ఇంటర్ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఫస్టియర్ మొత్తం విద్యార్థులు 4,89,123 మంది.. పాసైన విద్యార్థులు 3,23,807 మంది.. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 66.02.. బాలికల ఉత్తీర్ణత 74.4 శాతం.. బాలుర ఉత్తీర్ణత 57.69 శాతం.
పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 9 లక్షల 97 వేల 75 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది ద్వితీయ సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. మొత్తం 1495 పరీక్ష కేంద్రాలలో ఈ ఎగ్జామ్స్ జరిగాయి.
