NTV Telugu Site icon

Inter Supplementary Results : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Inter Results

Inter Results

తెలంగాణలోని ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అయితే నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ విడుదల చేశారు. అయితే.. https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఉమర్‌ జలీల్‌ తెలిపారు. అంతేకాకుండా.. సాయంత్రం నుంచి https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో మొదటి సంవత్సరం ఫలితాలు అందుబాటు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో రెగ్యులర్ సప్లిమెంటరీ కలిపి 80.80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు.