Site icon NTV Telugu

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్.. ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం..

Tg High Court Jobs

Tg High Court Jobs

Telangana High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సైట్‌లో అంతరాయం ఏర్పాడింది. హైకోర్టు సైట్‌లో ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్‌ సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. Hyderabad సైబర్‌ అభియోగాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాకర్లు ఎలా యాక్సెస్‌ చేశారు? సర్వర్‌లో ఏదైనా లోపాలున్నాయా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో కొద్దిసేపు హైకోర్టు వెబ్‌సైట్‌ సేవలు అంతరాయం చెందగా, ఆర్డర్ కాపీలు, కేసు వివరాలు తెరవడంలో అవాంతరాలు ఎదురయ్యాయి. సిస్టమ్‌ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి టెక్నికల్ టీమ్స్‌ చర్యలు ప్రారంభించాయి. ఈ హ్యాకింగ్ కేసు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

READ MORE: Prabhas : అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ప్రభాస్ సై అంటే సై

Exit mobile version