NTV Telugu Site icon

High Court of Telangana : బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి

Telangana High Court

Telangana High Court

Telangana high court permission for Warangal bjp public meeting

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ప్రజసంగ్రామ పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ పాదయాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు. అయితే.. రేపు మూడో దశ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్‌లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే.. దీనిపై బీజేపీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది.

 

సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యకూడదని, సభలో ఎలాంటి ఘటనలు జరిగిన పిటిషనర్లదే బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా.. సభకు వస్తున్న వారి వివరాలు పోలీసులకు అందజేయాలని, సభకు వచ్చే వీఐపీల వివరాలు పోలీసులకు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. వర్సిటీలో జరుగుతున్న పరీక్షలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని, అంబులెన్స్ సర్వీస్ కు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ సమస్యలు రాకుండా తగిన ఏర్పాట్లు ఉండాలని హైకోర్టు తెలిపింది.