Site icon NTV Telugu

TG High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు..

Ts High Court

Ts High Court

తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే.. జస్టిస్ రేణుకా యార, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్ మధుసూధన్ రావులు తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో తెలిపారు. నలుగురు అదనపు న్యాయమూర్తులు శుక్రవారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కాగా.. తాజాగా తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌‌గా జస్టిస్ సుజోయ్ పాల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే..

Exit mobile version