Viral Divorce: పెళ్లి కోసం వయసు తగ్గించి చెప్పిన భర్త.. కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ హైకోర్టు ఇటీవల ఒక వివాహ రద్దు కేసులో సంచలన తీర్పునిచ్చింది. మ్యాట్రిమోనియల్ పోర్టల్‌లో భర్త తన అసలు వయస్సును దాచిపెట్టి, 9 సంవత్సరాలు చిన్నవాడిగా తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడని తేలడంతో కోర్టు భార్యకు విడాకులు మంజూరు చేసింది.
కేసు నేపథ్యం..
2018 ఆగస్టులో వీరికి వివాహం జరిగింది. పెళ్లికి ముందు భర్త తన పుట్టిన తేదీని 1981గా చెప్పడంతో, వయస్సు సరిపోయిందని, జాతకాలు కలిశాయని నమ్మి భార్య తల్లిదండ్రులు ఈ పెళ్లి చేశారు. అయితే వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో అతని అసలు పుట్టిన తేదీ 1974 అని, అతను తనకంటే 9 ఏళ్లు పెద్దవాడని భార్యకు తెలిసింది. తప్పుడు వయస్సుతో జాతకాలు కలిపి తనను మోసం చేశారని గ్రహించిన ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అక్కడ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో హైకోర్టులో అప్పీల్ చేసింది.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ఇరుపక్షాల వాదనలు..
ఇద్దరూ కలిసి జీవించడానికి ఇష్టపడట్లేదని కోర్టుకు తెలిపారు. తనకు న్యాయమైన సెటిల్మెంట్ అందించి, తన బంగారు ఆభరణాలు తిరిగి ఇస్తే భర్తపై పెట్టిన గృహహింస, క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటానని పేర్కొంది. దీనికి ఆమె భర్త.. ఆమె ఆభరణాలు తన వద్ద లేవని, పైగా ఆమె వద్దే ఉన్న తన 7 తులాల బంగారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కేసులు వెనక్కి తీసుకుంటే వివాహ రద్దుకు అంగీకరిస్తానని తెలిపాడు.
హైకోర్టు తుది తీర్పు..
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భార్య అప్పీల్‌ను అనుమతిస్తూ, వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేసింది. అయితే, భార్య హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 25 కింద ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనందున, ప్రస్తుతానికి శాశ్వత భరణం మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. భరణం మరియు బంగారం రికవరీ కోసం ఆమె ఫ్యామిలీ కోర్టు లేదా సంబంధిత ఫోరమ్‌లో ప్రత్యేకంగా చట్టపరమైన చర్యలు చేపట్టే స్వేచ్ఛను కల్పిస్తూ తీర్పునిచ్చింది. భర్తపై ఉన్న గృహహింస, క్రిమినల్ కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!