Site icon NTV Telugu

Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Telangana Rains Today

Telangana Rains Today

Heavy rains today and tomorrow in Telangana: సోమ, మంగళ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, మెదక్, నాగర్‌ కర్నూల్‌, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: IND vs ENG: సచిన్‌ పక్కన నా పేరా?.. అండర్సన్‌ కీలక వ్యాఖ్యలు!

రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురు వారాల్లో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తన్నాయి. దాంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version