Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Hate Speech Bill 2026 Jail Penalty Social Media Rules

Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..

Published Date :March 30, 2026 , 2:08 pm
By RAMAKRISHNA KENCHE
Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hate Speech Bill: తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. స్పీకర్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేష పూరిత ప్రసంగాలకు చెక్ పడనుంది. మతం, కులం, లింగం లేదా ఇతర కారణాల వల్ల సమాజంలో విద్వేషం, అశాంతిని రేకెత్తించే ప్రసంగాలు, రచనలు లేదా సోషల్ మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టమే హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill). ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినమైన జరిమానాలు, జైలు శిక్షలు (7 ఏళ్ల వరకు) విధించడం, ఈ నేరాలను నాన్-బెయిలబుల్‌గా పరిగణించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. విద్వేష పూరిత ప్రసంగాలు మొదటి సారి రుజువు అయితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. శిక్షతోపాటు రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. ఇదే ఘటన మరోసారి పునరావృతమైతే జైలు శిక్ష పదేళ్లు, రూ. లక్ష జరిమానా విధిస్తారు.

READ MORE: 50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విద్వేష పూరిత ప్రకటనలు, ప్రసంగాలు సైతం పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇకపై సంఘం, సమూహం, సమావేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉండొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. మతం, జాతి, కులం, వర్గం, స్త్రీ, పురుష, లైంగిక, జన్మస్థలం, నివాసం, భాష, అశక్తత, తెగలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, ప్రసంగాలు ఉండొద్దని ఈ బిల్లును తీసుకొచ్చింది. మాటల ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్‌ మాధ్యమం/సాధనాల ద్వారా సమాచార మార్పిడి ఉన్నా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లు ద్వారా ఎలాంటి అసభ్యకర కంటెంట్, సందేశం, సమాచారం ఉంటే వాటిని తొలగించాలని ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇక మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా?, రెచ్చగొట్టే పోస్టులు చేసినా జైలు శిక్ష తప్పదు!

READ MORE: ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hate speech law India
  • jail penalty hate speech
  • new law Telangana
  • social media rules Telangana
  • speech restrictions India

తాజావార్తలు

  • Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • Maoist Narayana: అందుకే.. దేశ వ్యాప్తంగా పార్టీ కనుమరుగైంది!

  • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!

  • Tamil Nadu: నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. ర్యాలీలతో ప్రచారం జోరు

ట్రెండింగ్‌

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions