Telangana Group 1 exam today
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నేడు జరగనుంది. పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పరీక్ష ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. భారీ బందోబస్తు.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. అయితే.. పరీక్ష 10.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. 08.30 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించనున్న నేపథ్యంలో 08.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. అయితే.. పరీక్షకు 15 నిమిషాల ముందే అంటే 10.15 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూయనునన్నట్లు బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. సమయం ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
అయితే.. వరంగల్ పోలీసు కమిషనరేట్లో పరిదిలో నేడు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉండడంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అమలు చేయనున్నారు. ధర్నాలు, ర్యాలీలు, ఉరేగింపులు, రాస్తారోకో, సభలు సమావేశాలు నిషేధం విధించారు. పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సీపీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో 9,716 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నరు. పరీక్ష హాల్ టికెట్లు, కేంద్రాలపై సమాచారం, సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబరు..1800-4253424, హెల్ప్ లైన్ నంబరు 91542 52936.. సంప్రదించవచ్చు.
హన్మకండ: జిల్లా నుంచి 21,024 అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అయితే.. 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది లైజన్ అధికారులు, 49 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, ఇతర సిబ్బందిని నియమించారు.
వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ వన్ పరీక్షకు సర్వం సిద్ధం. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పరీక్ష కేంద్ర పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 121 పరీక్ష కేంద్రాలు,42,507 మంది అభ్యర్థులు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలు,21024 మంది అభ్యర్థులు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలు,9716 మంది అభ్యర్థులు. జనగామ జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలు,3410 మంది అభ్యర్థులు. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు,4052 మంది అభ్యర్థులు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాలు,2372 మంది అభ్యర్థులు. ములుగు జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలు,1933 మంది అభ్యర్థులు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నేడు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటలకు వరకు ఎగ్జామ్. ఉదయం 8.30 నుంచే ఎగ్జామ్ హల్లోకి అనుంతించనున్న అధికారులు. ఉదయం 10.15 నిమిషాల తర్వాత ఎగ్జామ్ హాల్లోకి నో ఎంట్రీ. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ సిస్టమ్. బయోమెట్రిక్ క్యాప్చర్ కాకపోతే వేలిముద్రలు పేపర్‌పై తీసుకోనున్న అధికారులు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు షూస్ వేసుకోవద్దని కండీషన్. గ్రూప్-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో TSPSC గ్రూప్-1 పరీక్ష ఎగ్జామ్. సంగారెడ్డిలో 12, పటాన్ చెరులో 7, రామచంద్రపురంలో 5, సదాశివపేటలో 2 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు.
పరీక్షలు రాయనున్న 8,654 మంది అభ్యర్థులు. పరీక్ష నిర్వహణ కోసం 26 మంది చీఫ్ సూపరింటెండెంట్‌ల నియామకం. ఎగ్జామ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్. మెదక్ జిల్లాలో నేడు TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు. మెదక్ జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. మెదక్ లో 4, నర్సాపూర్ లో 1, తూప్రాన్ లోని 2 సెంటర్లలో గ్రూప్-1 ఎగ్జామ్. జిల్లా వ్యాప్తంగా పరీక్షకు హాజరు కానున్న 3,312 మంది అభ్యర్థులు. సిద్దిపేట జిల్లాలో నేడు TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల కోసం 20 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు. పరీక్షలు రాయనున్న 7786 మంది అభ్యర్థులు. 256 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు.