Site icon NTV Telugu

Local body Elections: నేడు చివరి విడత ఎన్నికల పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..!

Bihar Elections

Bihar Elections

Local body Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు.

READ MORE: IPL Auction 2026: ముగిసిన ఐపీఎల్ వేలం.. సోల్డ్, అన్‌సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో నేడు 3,752 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరగనుంది. 12,652 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు, ఇతరులు 140 మంది ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

READ MORE: IBomma Ravi : ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్‌ కస్టడీ

Exit mobile version