Site icon NTV Telugu

TG Local Body Elections: నామినేషన్ వేస్తున్నారా..? ఈ పది పాయింట్స్ తప్పనిసరి.. లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్..!

Nomination

Nomination

TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆశావాహులు వారి ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే.. నామినేషన్లు దాఖలులో ఏ మాత్రం పొరపాటు జరిగినా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురై ఆశలు గల్లంతవుతాయి. నామినేషన్‌ పత్రంలో ముందు చూసుకోవాల్సిందని పది పాయింట్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం…

READ MORE: TTD : యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్… శ్రీవారి దర్శనంపై జీవితకాల నిషేధం

1) వయస్సు 21 సంవత్సరాలు నిండాలి.
2) సంబధిత ఓటరు లిస్టులో ఓటరు గా నమోదై ఉండాలి.
3) SC/ST/BC వారైతే కుల ధృవీకరణ పత్రం (caste certificate) జత పరచాలి.
4) డిపాజిట్ సొమ్ము కట్టాలి.
5) నేర చరిత్ర,చర, స్తిర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
6) ఎలక్షన్ expenditure maintain చేస్తానని declaration ఇవ్వాలి.
7) ఏదైతే స్థానం నుంచి పోటి చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి.
8) నామినేషన్ పత్రంలో: A)PART-1లో ప్రతిపాదకుని సంతకం ఉండాలి..
B)PART-2 లో అభ్యర్థి సంతకం ఉండాలి.
C)PART-3 లొ కూడా అభ్యర్ధి సంతకం ఉండాలి.
D)PART-4 లో RO సంతకం ఉండాలి.
E)PART-5(Rejected nominations reasons)లో RO సంతకం ఉండాలి.
F)PART 6 (receipt ) లొ RO సంతకం ఉండాలి.
9) అఫిడవిటీలో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం ఉండాలి.
10) Expenditure declarationలో అభ్యర్థి సంతకం ఉండాలి.

Exit mobile version