Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Gram Panchayat Elections Model Code Rules 2025

TG Local Body Elections: అభ్యర్థులు పాటించాల్సిన టాప్ 10 నియమాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే కేసులు, అభ్యర్థిత్వం రద్దు..!

Published Date :November 26, 2025 , 9:46 am
By RAMAKRISHNA KENCHE
TG Local Body Elections: అభ్యర్థులు పాటించాల్సిన టాప్ 10 నియమాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే కేసులు, అభ్యర్థిత్వం రద్దు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

TG Local Body Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు దఫాల్లో ఓటింగ్ జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు. అయితే.. గ్రామ పంచాయతీ మోడల్ కోడ్, స్పష్టమైన నియమాల గురించి తెలుసుకుందాం..

గ్రామ పంచాయతీ మోడల్ కోడ్.. స్పష్టమైన నియమాలు ఇవే..

1.పరిపాలన & అధికారుల కార్యక్రమాలపై నిషేధాలు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుండే మోడల్ కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పనుల ప్రకటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తిగా నిషేధం. ఇప్పటికే జరుగుతున్న పనులు మాత్రమే కొనసాగవచ్చు, కానీ కొత్త పనుల టెండర్లు ఇవ్వకూడదు.

2.ప్రజలకు ప్రకటించే వాగ్దానాలపై నిబంధనలు
అభ్యర్థులు లేదా పార్టీలు ప్రజలకు అనుచితంగా ఆకర్షణలు, బహుమతులు, డబ్బు, మద్యం, వస్తువులు ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. ఓటర్లను ప్రభావితం చేసే ప్రకటనలు, వాగ్దానాలు చేయరాదు.

3 ప్రచారం (Campaigning)పై స్పష్టమైన నియమాలు
పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఆలయాలు వంటి పబ్లిక్ ప్రదేశాలలో ప్రచార సామగ్రి పెట్టడం నిషిద్ధం. లౌడ్‌స్పీకర్‌ వాడకానికి స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి, నిర్ణీత సమయాలకు మాత్రమే అనుమతి (సాధారణంగా ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు). ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇతర అభ్యర్థులపై వ్యక్తిగత నిందలు, ద్వేష ప్రసంగాలు, మత–జాతి ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదు.

4.వాహనాల సంబంధిత నియమాలు
ప్రచార వాహనాలకు అనుమతి పత్రం తప్పనిసరి. అనుమతి లేని వాహనాలను ప్రచారంలో వాడితే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉంటుంది. వాహనాలపై బహుళ స్పీకర్లు, అధిక ధ్వని వినిపించే పరికరాలు నిషేధం…

5.పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు
ప్రభుత్వ భవనాలపై, విద్యాసంస్థలపై, విద్యుత్‌పోల్స్‌ పై ప్రచార పోస్టర్లు నిషిద్ధం. ప్రైవేట్ భవనాలపై ప్రచార బోర్డులు పెట్టాలంటే భవన యజమాని లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా జెండాలు/బ్యానర్లు పెట్టరాదు.

6.పోలింగ్ డే (ఓటింగ్ రోజు) నిబంధనలు….
పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధం. ప్యాంఫ్లెట్లు పంచడం, పార్టీ చిహ్నాలతో తిరగడం, బోర్డులు పెట్టడం నిషిద్ధం. ఓటింగ్ కేంద్రాల వద్ద బహుళ వ్యక్తులు గుంపులు గుంపులుగా నిలబడరాదు.

7.ఓటర్లపై అనుచిత ప్రభావం నిషేధం
డబ్బు పంపిణీ, గిఫ్ట్ ప్యాకెట్లు, బీరు/మద్యం, పూలు/కండువాలు ఇవ్వడం నేరం. ఓటర్లను బెదిరించడం, ఒత్తిడి చేయడం, ప్రలోభపెట్టడం నేరం.

8.సోషల్ మీడియా నిబంధనలు
అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రతి పోస్టు చట్టపరమైనది కావాలి. ఫేక్ న్యూస్, వ్యక్తిగత విమర్శలు, హింసకు ప్రేరేపించే పోస్టులు నిషేధం. స్పాన్సర్డ్ అడ్వర్టైజ్‌మెంట్లు ఖర్చు ఖాతాలో చూపాలి.

9.ఎన్నికల ఖర్చులపై నియమాలు..
ప్రతి అభ్యర్థి తన ఖర్చుల వివరాలు రోజువారీగా రికార్డు చేయాలి. ఎన్నికల అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారు. ఖర్చులు పరిమితిని మించి ఉంటే చర్యలు తీసుకుంటారు.

10. చట్ట అమలు…
మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే.. FIR నమోదు చేస్తారు. గిరీశాల నోటీసులు అందిస్తారు. అభ్యర్థిత్వం రద్దు (తీవ్ర ఉల్లంఘనలో) చేయబడుతుంది. ప్రచార వాహనాల స్వాధీనం చేసుకుంటారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • campaign restrictions Telangana elections
  • election expenditure rules
  • model code of conduct Telangana
  • panchayat election model code
  • panchayat election rules 2025

తాజావార్తలు

  • TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్‌ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్‌..

  • Kejriwal: దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయి.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న కేజ్రీవాల్

  • Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • Trump-Iran Talks: స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్! అంతర్జాతీయ మీడియాలో కథనాలు

ట్రెండింగ్‌

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions