Site icon NTV Telugu

MSVG: తెలంగాణలో చిరంజీవి సినిమా టికెట్ల ధరలు పెంపు.. ప్రీమియర్ షోపై ప్రభుత్వం క్లారిటీ!

Manashankara Varaprasad Garu

Manashankara Varaprasad Garu

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెగా అభిమానులకు ముఖ్యంగా సినిమా టీంకి అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెగాస్టార్ సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. వాస్తవానికి.. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. అయితే.. జనవరి 11న రాత్రి 8pmకి ప్రీమియర్ షోకు అనుమతి లభించింది. ఈ ప్రీమియర్ షోకు సంబంధించి టికెట్ రేటు రూ.600గా నిర్ణయించింది. అలాగే.. సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టిప్లెక్సుల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 12వ తేదీ నుంచి 18 తేదీ వరకు పెరిగిన టికెట్ల ధరలు అందుబాటులో ఉండనున్నాయి.

READ MORE: Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్‌లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు

Exit mobile version