Site icon NTV Telugu

MSVG: తెలంగాణలో చిరంజీవి సినిమా టికెట్ల ధరలు పెంపు.. ప్రీమియం షోపై ప్రభుత్వం క్లారిటీ!

Manashankara Varaprasad Garu

Manashankara Varaprasad Garu

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెగా అభిమానులకు ముఖ్యంగా సినిమా టీంకి అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగాస్టార్ సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. వాస్తవానికి.. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. అయితే.. జనవరి 11న రాత్రి 8pmకి ప్రీమియం షోకు అనుమతి లభించింది. ఈ ప్రీమియం షోకు సంబంధించి టికెట్ రేటు రూ.600గా నిర్ణయించింది. అలాగే.. సింగిల్ స్క్రీన్‌పై రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లేక్సీ రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

READ MORE: Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్‌లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు

Exit mobile version