NTV Telugu Site icon

Life Tax On EV’s: ఎలక్ట్రిక్ వాహనాలకు ఇకపై ఆ పన్ను కట్టాల్సిందే.. మినహాయింపుకు ఇక సెలవు

Ev

Ev

Life Tax On EV’s: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుంది. భారత్ లో కూడా వీటి వినియోగం ఘణనీయంగా పుంజుకుంటుంది. చాలా మంది పెట్రోల్, డీజీల్ తో నడిచే ఇంధన వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని పోత్సహించడానికి మొదట్లో రకరకాల బెనిఫిట్స్ ను అందించాయి. ప్రస్తుతం వీటిపై ప్రజల్లో అవగాహన పెరిగి వీటి వినియోగం పెరగడంతో ప్రభుత్వాలు వీటిపై అందిస్తున్న ఒక్కో బెనిఫెట్ ను తొలగిస్తూ వస్తున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రమోట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈవీలకు కొంత వెసులుబాటు కల్పించింది. వాటిలో భాగంగానే రోడ్డు ట్యాక్స్ నుంచి ఇప్పటి వరకు ఈవీలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు దానిని మళ్లీ విధిస్తున్నట్లు కొన్ని కార్ల కంపెనీ షోరూమ్ ల మేనేజర్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ అధికారులు స్పందించలేదు.

Also Read: ITR Refund: ఇన్ కమ్ ట్యాక్స్‌ రీఫండ్ ఇంకా క్రెడిట్‌ కాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి

దీనిని వాహన ధరను బట్టి 11-15 శాతం వరకు రవాణా శాఖ పన్ను విధిస్తున్నట్లు తెలుస్తోంది. జీరో రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉన్న వాహనాల సంఖ్యపై గతంలో తెంగాణ ప్రభుత్వం కొన్ని పరిమితలు విధించింది. అయితే ఈ పన్ను మినహాయింపును ఎత్తివేసినా దాని ప్రభావం ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పై అంతగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇంధనపు కార్లతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉండటంతో పాటు, రాబోయే రోజుల్లో వీటిపైనే ఆధారపడి రావడంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్లను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా వాహనాలపై లైఫ్ ట్యాక్స్ ను విధించడంతో దానిని కొనుగోలు సమయంలోనే చెల్లించాల్సి వస్తుంది. వాహనాలను కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం వాహనం వివరాలను RTA పోర్టల్‌ లో అప్‌ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తరువాత ఆటోమేటిక్ గా ఈ లైఫ్ ట్యాక్స్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పన్నును చూసినట్లయితే 10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ప్రైస్ కార్లకు 11 శాతం, 10-20 లక్షల్లోపు అయితే 14, 20 లక్షలక కంటే ఎక్కువ ఉంటే 15 శాతంగా ఉంది. అయితే ఇంత మొత్తం పన్ను చెల్లిస్తున్న ఈవీ ధరలు తక్కువగా ఉండటంతో వీటి కొనుగోలుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో కూడా వీటిని కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Show comments