Site icon NTV Telugu

Public Holiday List 2026: 2026లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల లిస్ట్ అవుట్.. 27 సాధారణ, 26 ఐచ్ఛిక సెలవులు..!

Public Holiday

Public Holiday

Public Holiday List 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల వివరాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది (2026)కి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు (General Holidays), 26 ఐచ్ఛిక సెలవులను (Optional Holidays) ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL.E) డిపార్ట్‌మెంట్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2026 సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అధికారిక ఉత్తర్వులలో పేర్కొన్న మొత్తం 27 సాధారణ సెలవు దినాలలో మూసివేయబడతాయి. దీంతో పాటు ప్రతి నెలలోని ఆదివారాలు, రెండవ శనివారాలు యథావిధిగా సెలవు దినాలుగా కొనసాగుతాయి.

Atal–Modi Suparipalana Bus Yatra: ఏపీ వ్యాప్తంగా అటల్–మోదీ సుపరిపాలన బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?

2026లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవులు..
* సంక్రాంతి (జనవరి 15)

* గణతంత్ర దినోత్సవం (జనవరి 26)

* హోలీ (మార్చి 3)

* ఉగాది (మార్చి 19)

* ఈదుల్ ఫితర్/రంజాన్ (మార్చి 21)

* శ్రీ రామ నవమి (మార్చి 27)

* డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)

* ఈదుల్ అజహా/బక్రీద్ (మే 27)

* బోనాలు (ఆగస్టు 10)

* స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)

* వినాయక చవితి (సెప్టెంబర్ 14)

* విజయ దశమి/దసరా (అక్టోబర్ 20)

* దీపావళి (నవంబర్ 8)

* క్రిస్మస్ (డిసెంబర్ 25).

CM Chandrababu: వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాం..

ఐచ్ఛిక సెలవులు:

* న్యూ ఇయర్ డే (జనవరి 1)

* కనుమ (జనవరి 16)

* శ్రీ పంచమి (జనవరి 23)

* మహావీర్ జయంతి (మార్చి 31)

* బుద్ధ పౌర్ణమి (మే 1)

* నరక చతుర్దశి (నవంబర్ 8)

* క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24).

Exit mobile version