NTV Telugu Site icon

భారీ వర్షాలు : తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తం అయింది. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల , విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు , ఉద్యోగులు హెడ్ క్వాటర్స్ లోనే ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తు, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.