TG Govt: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన.. సందేహాలుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Govt: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోంది. అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. పౌర సరఫరాల శాఖ వివరాల ప్రకారం.. కొన్ని పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా “నో స్టాక్” (No Stock) బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం, తప్పుడు వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమే. డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ, ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోంది.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
అంతేకాకుండా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) ముందస్తు చెల్లింపు (advance-payment) విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయి. ఇది కేవలం అంతర్గత పరిపాలన పరమైన విషయం మాత్రమే తప్ప, సరఫరాలో లోపం కాదు. పరిస్థితిని చక్కదిద్ది, అందరికీ సమానంగా ఇంధనం అందేలా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీసు శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ చేసినా లేదా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు అక్రమంగా మళ్లించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం కోరుతోంది. దయచేసి ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని (forward) కోరుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఏవైనా సందేహాలు ఉన్నా లేదా అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా, ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1967 ను సంప్రదించగలరు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!