Site icon NTV Telugu

Telangana Formation Day Celebrations LIVE: గోల్కొండ కోటలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. ప్రత్యక్షప్రసారం

Telangana

Telangana

Telangana Formation Day Celebrations LIVE: కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ తరుఫున ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో జరుపుతున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తొలిసారి అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.. గోల్కొండ కోటలో భారత ప్రభుత్వం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చరిత్రాత్మక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని కేంద్ర మంత్రి ఎగురవేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తొలిసారి… అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వివరించారు.

 

Exit mobile version