Site icon NTV Telugu

Sundeep Kishan Hotel: హీరో సందీప్‌ కిషన్ హోటల్‌ పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ..

Sundeep Kishan Hotel

Sundeep Kishan Hotel

Sundeep Kishan Hotel: గత కొద్ది నెలల నుండి తెలుగు రాష్ట్రాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రముఖ రెస్టారెంట్లు, చిన్న హోటలలో తనిఖీలు చేయడం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే తాజాగా హీరో సందీప్ కిషన్ పార్ట్నర్ గా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లలో హోటల్లో నాసరికం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని హాస్టల్స్, హోటల్స్, ఫుడ్ సప్లై చేసే కిచెన్ లో అధికారులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడైనా నాసిరకం పదార్థాలు వాడిన, అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా వారిపై తగు చర్యలు చేపడుతున్నారు.

Couples Viral video: పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో.. తమ డాన్స్‌నే చూసి తెగ నవ్వుకున్న వధూవరులు!

ఇందులో భాగంగానే.. వివాహ భోజనం హోటల్లో అధికారులు తనిఖీలు చేపట్టగా అక్కడ చాలా నాసరికంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. 2022 నాటికి గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగును అక్కడ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 500 గ్రాముల కొబ్బరి తురుము కొబ్బెరలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లుగా అధికారులు కనుగొన్నారు. ఇక వండేసిన ఫుడ్ ను స్టీల్ గిన్నెలో పెట్టి ఉంచారని., వాటికి సరైన లేబుల్స్ లేవని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో చెత్తబుట్టలకు ఎక్కడ కూడా మూతలు లేవని కూడా అధికారులు గుర్తించారు.

Fish Viral video: రైలు కాదు.. పట్టాలపై తిరుగుతున్న చేపలు! వీడియో వైరల్

అంతేకాకుండా.. ఫుడ్ హ్యాండిల్ చేసే వారి ఆరోగ్య పరిస్థితి సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు లేవని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో డ్రైన్ నీరు నిల్వ ఉండిపోయిందని., వంటల కోసం వాటర్ బబుల్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Exit mobile version