Site icon NTV Telugu

Katipally Venkata Ramana Reddy: తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇస్తుందా?

Katipally Venkata Ramana Reddy

Katipally Venkata Ramana Reddy

Katipally Venkata Ramana Reddy: ఎలక్ట్రిక్ వాహనాల మీద కేంద్రం సబ్సిడీ ఇస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇస్తుందా? కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. తాజాగా అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లోనే 60శాతం.. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉందని తెలిపారు.ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం లేదని.. తెలంగాణలో 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలే నడుస్తున్నాయని వెల్లడించారు. పొల్యూషన్ తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలి.. రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్ మినహాయిస్తూ.. ప్రోత్సహించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని తెలిపారు. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని చెప్పారు.

READ MORE: Toxic Movie: మోడ్రన్‌ డ్రెస్‌, పబ్‌.. ‘మెలిసా’గా రుక్మిణీ వసంత్‌ అదుర్స్!

త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రమోట్ చేయాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. “హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే.. ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలి.. ఎలక్ట్రిక్, సోలార్ ప్యానెల్ తో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలి.. పార్కింగ్ స్థలాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. ఇవీ పాలసీని తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు” అని ఎమ్మెల్యే వెల్లడించారు.

READ MORE: Sonia Gandhi: అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ.. ఆసుపత్రికి తరలింపు

Exit mobile version