Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering College Fee Hikes in Telangana: చదువు అనేది భవిష్యత్తుకు బాటలు వేసే వెలుగు కావాలి గానీ, ఒక కుటుంబం ఆర్థికంగా నలిగిపోయే చీకటి కాకూడదు. విద్యే అమృతం అన్న నానుడిని పక్కనబెట్టి, నేటి ఇంజినీరింగ్ విద్యావ్యవస్థ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోవడం అత్యంత విచారకరం. మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్ప ఇంజినీర్లుగా చూడాలన్న కలలతో తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తుంటే, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం అక్షరాలను వేలం పాటగా మారుస్తూ విచ్చలవిడిగా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన ఫీజుల నిబంధనలను బొందపెట్టి, చట్టాల పగ్గాలను తెంచుకుని, ఏటా 20% నుంచి 30% అదనంగా గుంజుతున్నాయి. అయినా ఈ కార్పొరేట్ భకాసురుల ధనదాహం తీరడం లేదు.
పరిమితి లేని దోపిడీ..
విద్యార్థి భవిష్యత్తును సరిదిద్దాల్సిన కళాశాలలు.. లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, డెవలప్మెంట్ ఛార్జీలు, చివరికి ఉద్యోగ సాధన పేరుతో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజులంటూ రకరకాల రంగుల పేర్లతో వేలకు వేలు అదనంగా లాగుతున్నాయి. రవాణా, హాస్టల్ వసతుల పేరుతో పరిమితి లేని దోపిడీ సాగుతోంది. మెరిట్ ఉన్న విద్యార్థులను పక్కనబెట్టి, ప్రవేశ పరీక్షలు జరగకముందే అడ్మిషన్ల పేరుతో ప్రలోభపెడుతూ, మేనేజ్మెంట్ కోటా కింద లక్షల రూపాయల డొనేషన్లు గుంజుతున్న తీరు విద్యా వ్యవస్థకే మచ్చగా మారింది. ఇంత భారీగా ఫీజులు దండుకుంటున్నా, తీరా కళాశాలల్లో చూస్తే అరకొర జీతాలకే నడిచే అనుభవరాహిత్య అధ్యాపకులు, అధునాతన ల్యాబ్ పరికరాలు లేని గదులు, నకిలీ సర్టిఫికేషన్లు, ఉనికిలోనే లేని కంపెనీల పేరుతో నామమాత్రపు ప్లేస్మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేస్తున్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఫిర్యాదులు చేసినా ఫలితం శున్యం..
ఈ కార్పొరేట్ అక్రమాలపై, నిస్సహాయ తల్లిదండ్రుల ఆవేదనపై హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి సంఘం నాయకుడు దేవరాల రాకేష్ యాదవ్.. “అక్షరాన్ని అమ్ముకునే వ్యాపారులారా… విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు!” అంటూ గళమెత్తారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అక్రమాలను ఆధారాలతో సహా తీసుకెళ్లారు. పలు ఇంజినీరింగ్ కళాశాలలు చట్టవిరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సి కేసుకు ఆదేశించడం, ఏఐసీటీఈ సదరు కళాశాలలకు నోటీసులు జారీ చేయడం, అలాగే సేకరించిన అదనపు ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ కావడం దేవరాల రాకేష్ పోరాటానికి దక్కిన తొలి విజయం. కానీ.. ఈ పోరాటం ఇంకా ఫలించలేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. టీజీఈఏపీసెట్–2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా, 75,054 సీట్లు భర్తీ అయ్యాయి. ఆగస్టు 7 చివరి తేదీ లోపు కళాశాలలను టు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 7 చివరి తేదీగా అధికారులు ఖరారు చేశారు. సమయం తక్కువగా ఉంది. ఇదే అదునుగా చూసుకుని కళాశాలలు మరోసారి రెచ్చిపోతున్నాయని దేవరాల రాకేష్ తెలిపారు. మళ్లీ అధిక ఫీజుల పర్వం మొదలైందని మరోసారి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్య వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత!
“జ్ఞానం పంచాల్సిన చోట ధనదాహం ఏలితే… విద్యార్థి మనసులో కసి కాదు, నిరాశే మిగులుతుంది.” చదువుకునే వయసులో ప్రతిభకు ప్రాధాన్యం దక్కక, ఆర్థిక భారం తట్టుకోలేక ఎందరో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి, కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, అక్రమ వసూళ్లకు పాల్పడే ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసే స్థాయి కఠిన చర్యలు చేపట్టాలి. విద్య అనేది వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత! ఆ బాధ్యతను కాపాడటానికి దేవరాల రాకేష్ లాంటి నాయకులు చేస్తున్న ఈ పోరాటం, ప్రైవేట్ యాజమాన్యాల కళ్లు తెరిపించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిజమైన న్యాయం చేకూర్చే వరకు సాగాల్సిందే.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!