Site icon NTV Telugu

Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్‌!

Vote

Vote

Telangana Elections 2023 Polling Start From 7AM: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానున్నది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం ఉండగా.. 13 నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌కు అవకాశం ఉంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా.. మహిళలు ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు. ఆ రోజు సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వస్తాయి.

Exit mobile version