Site icon NTV Telugu

Rahul Gandhi: తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారు: రాహుల్

Rahul Gandhi Medigadda Barriage

Rahul Gandhi Medigadda Barriage

Congress Leader Rahul Gandhi Slams BRS Over Kaleswaram Project: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. నాసిరకం నిర్మాణం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. గురువారం ఉదయం మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్‌ సందర్శించారు. ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. చివరకు కాంగ్రెస్‌ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్‌ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో రాహుల్ మేడిగడ్డను పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అనంతరం రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ఏటీఎం. మేడిగడ్డ బ్యారేజీని నేను ఈరోజు సందర్శించాను. తెలంగాణలో అవినీతితో నిండిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ఇది ఒక భాగం. నాసిరకం నిర్మాణం కారణంగానే పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పిల్లర్లు కుంగుబాటుకు గురవుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మరియు ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారు’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Also Read: IND vs SL: నేను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్‌ గాంధీ అంబట్పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం కరెప్షన్ చేసింది. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు.. ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే ఇలాంటి కుంగుబాటు వచ్చేవి కాదు. ప్రాజెక్టుకు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి.. నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి’ అని రాహుల్‌ ఫైర్ అయ్యారు.

Exit mobile version