Site icon NTV Telugu

BJP Candidates List: ఒక అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల!

Telangana Bjp

Telangana Bjp

BJP Released Second List For Telangana Candidates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండో జాబితాను విడుదల చేసింది. ఈరోజు విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ పేరుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. అతి త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది.

అక్టోబర్‌ 22న 52 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తారని ప్రకటించింది. కరీంనగర్‌ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చిన బీజేపీ.. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది.

మొదటి జాబితా:
బెల్లంపల్లి- శ్రీదేవి
సిర్పూర్‌ – పాల్వాయి హరీశ్‌బాబు
గోషామహల్‌- రాజాసింగ్‌
దుబ్బాక-రఘునందన్‌రావు
కరీంనగర్‌-బండి సంజయ్‌
ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌
బోథ్‌(ఎస్టీ) సోయం బాపూరావు
నిర్మల్‌- ఏ.మహేశ్వర్‌రెడ్డి
ముథోల్-రామారావు పటేల్‌
ఆర్మూర్‌- పైడి రాకేష్‌రెడ్డి
జుక్కల్‌- టీ.అరుణతార
కామారెడ్డి- కె.వెంకటరమణారావు
నిజామాబాద్‌ అర్బన్‌- ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త
ఖానాపూర్‌- రమేష్‌ రాథోడ్‌
కోరుట్ల- ధర్మపురి అరవింద్‌
సిరిసిల్ల- రాణీ రుద్రమరెడ్డి
చొప్పదండి-బొడిగె శోభ
మానకొండూరు అరెపల్లి మోహన్‌
కుత్భల్లాపూర్‌- కూన శ్రీశైలం గౌడ్‌
సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
కల్వకుర్తి-ఆచారి
మహేశ్వరం- శ్రీరాములు యాదవ్‌
వరంగల్‌ఈస్ట్‌- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
వరంగల్‌ వెస్ట్‌-రావు పద్మ
నిమాజాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ
ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్‌
ఖైరతాబాద్‌- చింతల రామచంద్రారెడ్డి
కార్వన్‌-అమర్‌ సింగ్‌
చార్మినార్‌- మెఘారాణి
చంద్రాయణ గుట్ట-సత్యనారాయణ ముదిరాజ్‌
యాకత్‌పురా-వీరేంద్రయాదవ్‌
బహుదూర్‌ పురా- వై.నరేష్‌కుమార్‌
కొల్లాపూర్‌- ఏ సుధాకర్‌రావు
నాగార్జున సాగర్‌-కే.నివేదిత రెడ్డి
సూర్యాపేట- సంగినేని వెంకటేశ్వరరావు
భువనగిరి-గూడూరు నారాయణరెడ్డి
తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య
జనగాం- డా.ఏ దశ్మంతరెడ్డి
స్టేషన్‌ ఘన్‌పూర్‌-డా. గుండె విజయరామారావు
బాల్‌కొండ-ఆలేటి అన్నపూర్ణమ్మ
జగిత్యాల- డా.బోగా శ్రావణి
రామగుండం-కందుల సంధారాణి
చొప్పదండి-బోడిగ శోభ
నర్సాపూర్‌- ఎర్రగొల్ల మురళీయాదవ్‌
పటాన్‌చెరు-టీ.నందీశ్వర్‌గౌడ్‌
వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్‌
భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్‌ నాయక్‌
భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు
పాలకుర్తి- లేగ రామ్మోహన్‌రెడ్డి
డోర్నకల్‌ (ఎస్టీ)- భుక్యా సంగీత
మహబూబాబాద్‌ (ఎస్టీ)- జతోత్‌ హుస్సేన్‌ నాయక్‌

రెండో జాబితా:
మహబూబ్‌నగర్‌ – ఏపీ మిథున్‌ రెడ్డి

Exit mobile version