NTV Telugu Site icon

TS Election Commission: భద్రాచల శ్రీరామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది..

Vikas Raj

Vikas Raj

రాష్ట్రంలో పారదర్శకంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఓటరు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకుంటాము.. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి.. తనిఖీ బృందాలను పెంచాము.. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఓటర్ స్లిప్స్ పంపిణీ ప్రక్రియ తొందరగా చేపడతాము.. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయొచ్చన్నారు. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. యూత్ ఓటర్లు ఓటు వేసేలా కాలేజీల్లో క్యాంపస్ అంబాసిడర్లను నియమించాము అని సీఈఓ వికాస్ రాజ్ పేర్కొన్నారు.

Read Also: AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..

తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయి.. దాడులు జరిగే పరిస్థితులు లేవు.. కేంద్ర బలగాలు కూడా రాష్ట్రానికి వచ్చాయని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించాము.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నామినేషన్ పత్రాలు జాగ్రత్తగా పూర్తి చేయాలి.. నిబంధనలకు లోబడి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనాలి అన్నారు. భద్రాచల శ్రీరామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్క్రీనింగ్ కమిటీ ఉంది.. ఈ కమిటీ నిర్ణయం ఎలా ఉంటే అదే ఈసీఐకి నివేదించాము.. ఈసీఐ నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది అని వికాస్ రాజ్ తెలిపారు.