Site icon NTV Telugu

TG EdCET Results 2024: తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..

Tg Edcet

Tg Edcet

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు రిజల్ట్స్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Read Also: Vijay Deverakonda: స్ట్రాంగ్ గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి!

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్‌సెట్‌(TGEDSET) పరీక్షను మే 23న నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 29, 463 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ఈసారి ఎడ్‌సెట్‌ పరీక్షలను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ నిర్వహించింది. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14, 285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version