Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు!
- కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ
- సినీ హీరో అయినా పరిస్థితులను అర్థం చేసుకోవాలి
- మోహన్ బాబుపై చర్యలు తీసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. పౌరులుగా ప్రతి ఒక్కరు బాధ్యాతాయుతంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు. మీడియా ప్రతినిదిపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ చెప్పారు. నేడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటులు అల్లు అర్జున్ (సంధ్య థియేటర్ తొక్కిసలాట), మంచు మోహన్ బాబు (మీడియా ప్రతినిదిపై దాడి) ఘటనలపై ఆయన స్పందించారు.
‘వ్యక్తిగతంగా మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం. ఆయన సినీ హీరో (అల్లు అర్జున్) కావొచ్చు.. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు. ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు మంచిది కాదు. సినిమాల్లో హీరోలు అయినా బయట మాత్రం పౌరులే. పోలీసు శాఖ చట్టానికి లోబడి పనిచేస్తుంది. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తాం’ అని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Also Read: IND Vs WI: టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!
‘సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశాం. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయి. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలి. హీరోలు స్థానిక పరిస్థితులకు అనుకులంగా వ్యవహరించాలి. ప్రజలకు రక్షణ కల్పించడం మా మొదటి ప్రాధాన్యం. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రజల భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!