Site icon NTV Telugu

Crime News: సరూర్‌నగర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త!

Sarurnagar Murder

Sarurnagar Murder

కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భార్యను చంపిన తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

Also Read: Balakista Reddy: ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్‌ తరగతులను ప్రారంభిస్తాం.. డబ్బులు వృధా చేసుకోవద్దు!

తూర్పుగోదావరి కొమ్మనపల్లికి చెందిన భార్య భర్తలు మరియాదాస్‌, అమృత పొట్టకూటికోసం హైదరాబాద్‌ వచ్చారు. గత మూడేళ్లుగా సరూర్‌నగర్‌లో ఉంటున్నారు. వివాహేతర సంబంధాలపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇవాళ అమృత ఫోన్ మాట్లాడుతుండగా.. మరియాదాస్‌ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో మరియాదాస్‌ కోపోద్రిక్తుడయ్యాడు. మెడకు చున్నీ బిగించి భార్య అమృతను భర్త మరియాదాస్‌ చంపేశాడు. అమృతను చంపిన తర్వాత మరియాదాస్‌ నేరుగా సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మరియాదాస్‌ను అరెస్ట్ చేశారు.

Exit mobile version