యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పెరుగతూ వస్తోంది. అయితే.. కరోనాతోనే సతమతమవుతున్న ప్రజలపై మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ దాడి చేసేందుకు కాచుకొని కూర్చుంది. అయితే తాజాగా తెలంగాణలో 40,593 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 923 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అంతేకాకుండా.. గడిచిన 24 గంటల్లో 739 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే ఇప్పటి వరకు మొత్తం 8,18,290 మందికి కరోనా సోకగా.. 8,09,009 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4111 మంది కరోనాతో మృతి చెందారు. అయితే.. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 366, రంగారెడ్డిలో 79, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 59, నల్గొండలో 51, పెద్దపల్లిలో 34, మంచిర్యాలలో 30, నిజామాబాద్‌లో 28, యాదాద్రి భువనగిరిలో 24, హనుమకొండలో 22, కరీంనగర్‌లో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.