రోజు రోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తుంది. అయితే తాజాగా.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,320మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 771 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. హైదరాబాదులో అత్యధికంగా 289 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 53, పెద్దపల్లి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 8,20,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,10,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,733 కరోనా కేసుల యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉంటే.. మరోవైపు మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలపై విరుచుకుపడుతోంది. ప్రజలు మంకీపాక్స్‌పై అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించారు.