Site icon NTV Telugu

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అరెస్ట్‌

తెలంగాణ‌లో ప్ర‌భుత్వం భారత్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌డం మొద‌లుపెట్టాయి.  అంతేకాదు.. రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్ర‌పు బ‌గ్గీపై అసెంబ్లీకి వ‌చ్చారు.  అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్ర‌పు బ‌గ్గీని అనుమ‌తించాల‌ని పోలీసుల‌కు కోరారు.  దీనిక పోలీసులు అనుమ‌తించ‌లేదు.  నేత‌లు వాగ్వాదానికి దిగ‌డంతో కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భట్టిని రాంగోపాల్‌పేట పీఎస్‌కు తలించారు. గుర్రాలపై అసెంబ్లీ లోనికి వెళ్తామని పట్టుబట్టారు ఎమ్మెల్యేలు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటేనని., కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు టీ కాంగ్రెస్ నేతలు.

Exit mobile version