NTV Telugu Site icon

Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పై ఫోకస్ పెట్టిన‌ ప్రభుత్వం..

Utham2

Utham2

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో అత్యవసరంగా జర్గుతున్న మరమ్మత్తులను క్షేత్రస్థాయిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి‌ పరిశీలించారు. బ్యారేజ్ 34 వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద జరిగిన గ్రౌటింగ్ పనులను పరిశీలించి, పనుల పురోగతిని ఈఈ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లో తొలిగించిన ఇసుక మేటలను, సీసీ బ్లాక్ ల అమరికను మంత్రి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్న గత ప్రభుత్వం బయటపెట్టలేదని., కాళేశ్వరం ప్రాజెక్టు లో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టు, బ్యారేజిలు డ్యామేజ్ అయ్యాయని ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.

Hyderabad Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షాలు..

NDSA అధికారుల ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా.. కాళేశ్వరం పునరుద్దరణ చేబట్టామని., మా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చాక నేషనల్ డ్యాం సేప్టి అథారిటికి పనుల పరిశీలన అప్పజెప్పామని ఆయన పేర్కొన్నారు. ఏయే టెస్ట్ లు చేయాలో.. ఏవిధంగా పనులు చేయాలో NDSA మాకు తెలిపిందని., ఎన్నికల‌ సందర్భంగా పనుల పరిశీలన వీలుకాలేదని ఆయన అన్నారు. ఎవరి పనులు ఎవరు చేయాలో కంపేనీలకి పనులు అప్పజెప్పామని., వర్షకాలం సమీపిస్తున్న దృష్ట్యా పనులు వేగవంతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జస్టీస్ పినాకి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పరిశీలన చేస్తామని ఆయన అన్నారు. అలాగే తుమ్మిటిహెట్టి వద్ద కూడా బ్యారేజి నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

Taapsee Pannu: రెడ్ వైన్ ల మెరిసిపోతున్న తాప్సీ పన్ను