Site icon NTV Telugu

Revanth Reddy : నేడు నిజామాబాద్ కు సిఎం రేవంత్.. డిఎస్ భౌతిక కాయానికి నివాళులు..

Revanth

Revanth

Revanth Reddy : నేడు నిజామాబాద్ జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డి.ఎస్. భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. 9:15 గంటలకు ఆయన తన నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 9: 30 బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరానున్నారు సిఎం. 10:30 కు నిజామాబాద్ కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ కు సిఎం చేరుకుంటారు. 10 :45 కు డి. శ్రీనివాస్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన డి.ఎస్. పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. తిరిగి మళ్లీ 11 గంటలకు తిరుగు ప్రయాణం చేయనున్నారు సీఎం.

Congratulations Team India : టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రముఖులు..

నిజామాబాద్ లో నేడు డి.శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం ప్రగతి నగర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ రోడ్డులోని డి.ఎస్. సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

Virat Kohli Retirement: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!

Exit mobile version