NTV Telugu Site icon

CM Revanth Reddy : రెండో రోజు దావోస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (WEF) పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పావిలియన్‌ను ప్రారంభించారు. ఈరోజు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న దావోస్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం వివిధ దేశాల ప్రముఖులతో పాటు ఇండియాకు చెందిన గౌరవ అతిథులతో భేటీ అయ్యింది. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య ప్రసంగం చేస్తూ, తెలంగాణలో పారిశ్రామిక వృద్ధిని హైలైట్ చేశారు. బయోటెక్నాలజీ, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు:

తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ లక్ష్యమైన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు.

ప్రతినిధి బృందం ప్రయాణం:

జ్యూరిచ్ నుండి దావోస్ వరకు రైలులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దావోస్‌లో వారి బృందానికి ఘన స్వాగతం లభించగా, తెలుగు వారితో పాటు వివిధ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

అంతకుమందు.. సింగపూర్ నుంచి జ్యూరిచ్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో తెలుగు వారు గౌరవాభినందనలు తెలుపుతూ ఘన స్వాగతం ఇచ్చారు. ఈ పర్యటన తెలంగాణ ప్రభుత్వం యొక్క అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు సహాయపడుతుందని అంచనా.

 Donald Trump 2.0: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం