CEO Vikasraj: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. 10 వేల మంది సిబ్బందింతో ఓట్ల లెక్కింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CEO Vikasraj: తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 17 నియోజక వర్గాలలో ఒక్కో పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశామని.. మల్కాజ్‌గిరిలో అదనపు హాల్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకు అనుమతి లేకుండా ఎవ్వరినీ అనుమతించమన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్ అండ్ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రం మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ హాల్ వరకు ప్రత్యేకమైన దారి సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందని సీఈవో వెల్లడించారు. 2 లక్షల 80 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయన్నారు. 276 టేబుళ్లను పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్ వద్ద ఈసీఐ అబ్జర్వర్ ఉంటారన్నారు. అత్యధికంగా 24 రౌండ్లు, చొప్పదండి, యాకత్ పుర, దేవరకొండలో ఉంటాయన్నారు. అత్యల్పంగా 13 రౌండ్లు ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావు పేట్‌లో ఉంటాయని ఆయన తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కౌంటింగ్ సిబ్బంది అవసరమని.. మరో 50 శాతం అడిషనల్‌గా అందుబాటులో పెట్టామన్నారు.
Also Read
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
Read Also: Komatireddy Venkat Reddy: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. కేసీఆర్ కూడా చెప్పారు..
రాష్ట్రవ్యాప్తంగా 49 అబ్జర్వర్లు ఎన్నికల సంఘం నుంచి నియమించామన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ ఏజెంట్ల లిస్టు రాజకీయ పార్టీలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్న ఆయన.. ప్రతీ టేబుల్ వద్ద వీళ్ళు ఉంటారన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని.. పోస్టల్ బ్యాలెట్ ఉన్న చోట 8.30 నిమిషాలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. ప్రతీ రౌండ్‌కు సిబ్బందితో పాటు అబ్జర్వర్లు కూడా ఈవీఎం కౌంటింగ్ చేస్తారన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో భారీ బందోబస్తు నడుమ పెడతారన్నారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జూన్ 2న జరుగుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ కౌంటింగ్ మహబూబ్ నగర్‌లోనే ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ జూన్ 5న జరుగుతుందని.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. కౌంటింగ్ కోసం 4 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 24 టేబుళ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?