NTV Telugu Site icon

CEO Sudarshan Reddy: కొత్త ఓటర్లూ పేర్లను నమోదు చేసుకోండి..

Ceo Sudarshan Reddy

Ceo Sudarshan Reddy

CEO Sudarshan Reddy: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025.. ఆగస్ట్ 20 నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వారందరూ, 2025 జనవరి 1 తేదీకి 18 ఏళ్లు నిండబోయే వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. Voters.eci.gov.in లేదా Voter Helpline Mobile app ద్వారా నమోదు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Minister Uttam Kumar Reddy: మరమ్మతులు, పునరుద్ధరణకు వారంలో టెండర్లు.. అధికారులకు మంత్రి ఆదేశాలు

ఓటరుగా నమోదుకై ఏడాదిలో నాలుగు అర్హత తేదీలు ఉంటాయని.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అని నాలుగు అర్హత తేదీలు ఉంటాయన్నారు. అక్టోబర్ 28 వరకు సవరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 119 నియోజకవర్గాలకి 119 ఈఆర్వోలు ఉంటారని.. బీఎల్వోల ఇంటింటికి వెళ్లి సవరణలు చేస్తారని చెప్పారు. ఒకే వ్యక్తికి నాలుగైదు ఓటర్ కార్డులు ఉంటున్నాయన్నారు. డ్రాప్ట్ ఎలక్ర్టల్ రోల్ జరుగుతుందని.. వాటిని రాజకీయ పార్టీలకి అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. డ్రాప్ట్ ఎలక్ర్టల్ రోల్ వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామన్నారు. ఓటర్ కార్డ్‌కు ఆధార్ కార్డ్ లింక్ 60 శాతం వరకు అయిందని సీఈవో సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Show comments