Site icon NTV Telugu

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ..

Tg Cabinet

Tg Cabinet

Telangana Cabinet Meeting Today: తెలంగాణలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న క్యాబినెట్ సమావేశం కీలక చర్చలకు వేదిక కానుంది. ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాలను మంత్రి వర్గం విస్తృతంగా పరిశీలించనుంది. రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, నష్టాలు, అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాదులో భూగర్భ విద్యుత్‌ కేబుల్ వ్యవస్థను వేగంగా విస్తరించడం, భవిష్యత్తు డిమాండ్ తీర్చేందుకు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై కూడా సమీక్ష జరుగుతుంది.

READ MORE: Pradeep Ranganathan: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై భారీ బజ్.. ఈ ఏడాది మూడో 100 కోట్ల హిట్ కొట్టనున్నాడా?

ఇంధన విధానం అమలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాల ప్రణాళికలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. అదనంగా, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల తుది నిర్ణయాలకు సంబంధించిన అంశాలు క్యాబినెట్ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం. ఈరోజు సమావేశం రాష్ట్ర పరిపాలనా దిశలో కీలక నిర్ణయాలకు పునాది వేయొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

READ MORE: Karnataka: సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య రహస్య ఒప్పందం ఫలించేనా..?

Exit mobile version